News March 9, 2025
మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం: ఎంపీ

ఏలూరు నగరాన్ని మేజర్ సిటీగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News March 10, 2025
స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్‌కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.
News March 10, 2025
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్: షామా మహ్మద్

కెప్టెన్ రోహిత్ శర్మపై <<15636348>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ CT విజేత భారత జట్టుకు అభినందనలు తెలిపారు. 76 పరుగులతో జట్టును ముందుండి నడిపిన హిట్ మ్యాన్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. శ్రేయస్, రాహుల్ కీలక ఇన్నింగ్సుతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారని కొనియాడారు.
News March 10, 2025
KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.