News March 9, 2025
వేటపాలెం: గుర్తుతెలియని మృతదేహం కలకలం

వేటపాలెం మండలంలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండల పరిధిలోని కొత్తరెడ్డిపాలెం- రొయ్యల చెరువు పక్కన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
NZB: న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష: SHO

న్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం రాత్రి ముగ్గురు మహిళలు అసభ్యంగా ప్రవర్తిస్తూ పబ్లిక్‌లో న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
News November 7, 2025
శ్రీరాంపూర్: సింగరేణి డిపెండెంట్లకు శుభవార్త

INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి ఇప్పటివరకు నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది కారుణ్య అభ్యర్థులు ఈ నెల 12న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నియామక పత్రాలు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. దీని ద్వారా సింగరేణి వ్యాప్తంగా 473 మంది కార్మిక కుటుంబాలు న్యాయం పొందనున్నాయని పేర్కొన్నారు.
News November 7, 2025
ఏటూరునాగారం ఫారెస్ట్‌లో సీతాకోక చిలుకల సర్వే

ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ అభయారణ్యం పరిసరాలలో సీతాకోకచిలుకలు, చిమ్మెటలపై సర్వే గురువారం ప్రారంభమైంది. అడవుల విస్తరణ, పునరుత్పత్తికి దోహదపడే వీటి సంతతి, మనుగడపై ఈ సర్వే ఈనెల 9 వరకు జరగనుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేను డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 33 మంది నిపుణులు పాల్గొంటున్నారు.


