News March 9, 2025
ప్రయాణికులకు అలర్ట్..ఆ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పు

మచిలీపట్నం(MTM)-విజయవాడ(BZA) మెము ట్రైన్(నం.67268) టైమింగ్స్‌ను ఈనెల 13 నుంచి మార్పు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 03.50కి MTMలో బయలుదేరి ఈ ట్రైన్ ఈనెల 13 నుంచి 03.25కి బయలుదేరి ఉదయం 5.55కి బదులుగా 5.30కి విజయవాడ చేరుకుంటుందన్నారు. విజయవాడలో ఉదయం బయలుదేరే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కనెక్ట్ చేసేలా ఈ మేరకు టైమింగ్స్ మార్చామన్నారు.
Similar News
News April 18, 2026
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని CM వినతి

MHBD బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని CM రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం, పర్యావరణ హితంగా ఉక్కు ఉత్పత్తి చేసే పరిశ్రమల ఆవశ్యకతను వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
News April 18, 2026
స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కలెక్టర్

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
News April 18, 2026
మదనపల్లెలో నేటి టమాటా ధరల వివరాలు.!

మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో టమాటాలు రూ.24కి కొనుగోలు చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకు వచ్చారు. స్థానిక వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటాల బాక్స్ రూ.240 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే రెండవ రకం టమాటాలు రూ.190 అమ్ముడు పోగా.. మూడవ రకం టమాటాలు రూ.180 పలకడంతో రేట్లు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.


