News March 9, 2025
క్రికెటర్ ఇంట్లో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎమ్మెల్యే

టీం ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ శనివారం తన నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో నాంపల్లి MIM ఎమ్మెల్యే మహమ్మద్ మజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ చేశారు. ఈ విందుకు సిరాజ్, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Similar News
News March 7, 2026
HYDలో హాకీ సమరం.. కెప్టెన్లకు ఘన స్వాగతం

హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న FIH మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2026 వేడుకలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత్, ఇంగ్లాండ్, కొరియా సహా 8 దేశాల కెప్టెన్లకు క్రీడా శాఖ అధికారికంగా స్వాగతం పలికింది. భారత జట్టుకు సలీమా టెటె నాయకత్వం వహిస్తుండగా.. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. భాగ్యనగరంలో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొంది.
News March 7, 2026
HYD: అడ్వర్టైజమెంట్లపై కొత్త రూల్స్..!

HYD నగర సౌందర్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ‘అవుట్‌డోర్ అడ్వర్టైజమెంట్ పాలసీ-2026’ని అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి హోర్డింగ్‌కు అడ్వర్టైజమెంట్ రెగ్యులేటరీ కమిటీ (ARC) అనుమతితో పాటు క్యూఆర్ కోడ్, జియో-ట్యాగింగ్ తప్పనిసరి. వారసత్వ కట్టడాలు, విద్యాసంస్థల వద్ద ప్రకటనలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు లేకుండానే తొలగించడమే కాకుండా, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
News March 7, 2026
HYD: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అలర్ట్.. వాళ్ల ఇళ్లు రద్దు !

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నా లేదా అద్దెకు ఇచ్చినా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు ఆ ఇళ్లను కేటాయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


