News March 9, 2025

అనారోగ్యంతోనే నా బిడ్డ మృతి: YS అభిషేక్ తండ్రి

image

తన బిడ్డ మృతిపై దుష్ర్పచారం చేయడం బాధాకరమని YS అభిషేక్ రెడ్డి తండ్రి YS మదన్ మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘వివేకా హత్య కేసు సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోతున్నారని కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారం చేస్తున్నాయి. నా కుమారుడు అనారోగ్యంతోనే చనిపోయాడు. గంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న సైతం ఆరోగ్యం సరిగా లేక కన్నుమూశారు. ప్రభుత్వం సిట్ అంటోంది. అది కాదు జ్యుడీషియల్ విచారణ చేపట్టండి’ అని ఆయన కోరారు.

Similar News

News March 24, 2026

కడప: కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా?

image

ఉమ్మడి కడప జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ నడుస్తోంది. భౌగోళిక, జనాభా ప్రాతిపదికన కడప రూరల్, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్లలో ఒకటి. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉండటం, రైల్వే, రోడ్డు మార్గాలు ఉండటంతో ఎర్రగుంట్ల కూడా నియోజకవర్గం అయ్యే అవకాశం ఉంది. ఇక నందలూరు పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఏవి నియోజకవర్గాలు అవుతాయో చూడాలి.

News March 24, 2026

కడప: జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ‘స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్’

image

కడప జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్‌‌కు గాను కలెక్టర్ శ్రీధర్ ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు (India’s Honest Independent Honour)కు ఎంపికయ్యారు. మార్చి 28న న్యూ ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగే 106 వ స్కోచ్ సమ్మిట్‌ అవార్డు ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ అవార్డును స్వీకరించనున్నారు.

News March 24, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,450
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.13,294
* వెండి 10 గ్రాములు ధర రూ.2,275.