News March 9, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

బయ్యారం మం. మిర్యాలపెంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారేపల్లి సూర్యతండాకు చెందిన కళ్యాణ్, విజయ్ బైక్‌పై స్నేహితుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి కళ్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ తాకడంతో మృతి చెందాడు. విజయ్ గాయంతో బయటపడ్డాడు. కళ్యాణ్‌కు 2 నెలల క్రితమే వివాహం నిశ్చయమవగా హోలీ తర్వాత పెళ్లి పెట్టుకుందామనుకున్నారు.
Similar News
News March 25, 2026
ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(1/2)

జిల్లాలో పసిపిల్లల విక్రయాలే కాకుండా రెండు సంవత్సరాల మోక్షిత్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పసిపిల్లల విక్రయాలలో కేసులో జనసేన మండల నాయకుడు అనిశెట్టి నాగబాబు తల్లి వీరమ్మను మాత్రమే అరెస్టు చేశారు. ఇందులో నాగబాబు, అదేవిధంగా మరో నాయకుడు ఆంజనేయులు అలియాస్ అంజిబాబు ఉన్నప్పటికీ వారిని అదుపులోకి తీసుకోలేదు.
News March 25, 2026
ఏలూరు: శిశువుల విక్రయాలు, కిడ్నాప్స్.. పోలీసుల తీరుపై అనుమానాలు!(2/2)

పోలీసులకు, రాజకీయ నాయకులకు ముడుపులు అందిన మూలంగానే కేసు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. పిల్లల విక్రయాలలో ఏలూరులో జనని హాస్పిటల్ డాక్టర్ దంపతుల ప్రమేయం ఉందని తేలినా వారిని అదుపులోకి తీసుకుని వెంటనే విడిచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే.. ఇంతటి సీరియస్ కేసుని పోలీసులు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారనడంలో సందేహం లేదన్నది పలువురి వాదన.
News March 25, 2026
రహదారి ప్రమాదాల నివారణకు ‘స్టాప్ అండ్ గో వాష్’

అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘స్టాప్ అండ్ గో వాష్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. SP రాహుల్ మీనా ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై బుధవారం తెల్లవారుజామున వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.


