News March 9, 2025
విజయనగరంలో ముగ్గురు కార్యదర్శులు సస్పెన్షన్

విజయనగరం నగర పాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బులు సకాలంలో నగర పాలక సంస్థకు జమ చేయని ముగ్గురు కార్యదర్శులను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ పి.నల్లనయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పన్ను వసూలు చేసి సకాలంలో జమ చేయడం లేదని గుర్తించి పన్ను డబ్బులు జమ చేపించి సస్పెండ్ చేశామన్నారు. పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 10, 2025
విశాఖలో క్రికెట్ బెట్టింగ్.. బుకీ అరెస్ట్: సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్,సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతుంటాడని సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం తెలిసిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
News March 10, 2025
850 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు: VZM SP

జనవరి నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంటలు దాటిన తరువాత సరైన కారణం లేకుండా పట్టణంలో సంచరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అలాంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తునట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నారు.
News March 10, 2025
ఇక నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం: VZM SP

విజయనగరం జిల్లాలో MLC ఎన్నికల కోడ్ ముగియడంతో ఇకపై యథావిధిగా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.