News March 9, 2025
ఈనెల 16న ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ

ఎన్టీఆర్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ను ఈ నెల 16వ తేదీన ఆంధ్ర లయోలా కాలేజీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వైఈఎస్- జె వ్యవస్థాపకులు, డైరెక్టర్ బి. బాలకుమార్, మ్యాజిక్ యూత్ ప్రతినిధి హర్షిత తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను లయోలా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
Similar News
News March 15, 2026
కడప: 10th పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
News March 15, 2026
నిమ్మనపల్లె: ‘అతని చదువుకు పేదరికం తలవంచింది’

ఏడాది వయసులో తల్లితండ్రులను కోల్పోయి అక్క, మేనమామ ఇంట్లో పెరిగాడు. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డొచ్చినా.. వెనకడుగు వేయలేదు. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం, అతని సంకల్పం ముందు పేదరికం తలవచింది. UPSC సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో అన్నమయ్య (D) నిమ్మనపల్లె (M) అగ్రహారానికి చెందిన గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు సాధించాడు.
News March 15, 2026
యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.


