News March 9, 2025
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిర్యాదులు రాసి ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.
Similar News
News October 17, 2025
2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ రెడీ: ఇస్రో

మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిషియల్ మాడ్యూల్స్ 2027 నుంచి ఇన్‌స్టాల్ చేస్తామని ISRO ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ’చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్‌తో దాని తదుపరి ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. గగన్‌యాన్-3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్, డిజాస్టర్ ఇలా అనేకరకాల మేలు జరుగుతోంది’ అని అన్నారు.
News October 17, 2025
జూబ్లీలో నామినేషన్లు ఎక్కువైతే ఏం చేద్దామంటారు?

జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా అధికారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నామినేషన్లు పరిమిత సంఖ్యలో వస్తాయనుకుంటే వాటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అధిక సంఖ్యలో వస్తే ఏం చేయాలనేదానిపై అధికారులు సమాలోచనలో పడ్డారు. 407 పోలింగ్ స్టేషన్లుండగా వాటికి 569 ఈవీఎంలు, 569 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు. ఉపసంహరణలు ముగిసిన తర్వాతే పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.
News October 17, 2025
HYD: మా వైపే జనం: BRS

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో BRS, కాంగ్రెస్ మధ్య <<18031896>>రాజకీయం రసవత్తరంగా<<>> మారింది. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జోష్.. BRSలో చేరుతున్న అన్ని పార్టీల లీడర్లు, క్యాడర్.. విజయం వైపు దూసుకెళ్తున్న BRS అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్.. KCR పాలననే బాగుండే అని ప్రజలు అంటుర్రు.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు.. జూబ్లీహిల్స్‌లో కారుదే విజయం’ అని BRS Xలో ట్వీట్ చేసింది.