News March 9, 2025
ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News September 15, 2025
KMR: ప్రేమ పెళ్లికి నిరాకరించారని యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్ మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మానస(21) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News September 15, 2025
కృష్ణా: ఈ నెల 16 పాఠశాల ఫెన్సింగ్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న పటమట ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, 17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
News September 15, 2025
‘వేములవాడ రాజన్న ఆలయ మూసివేతపై క్లారిటీ ఇవ్వాలి’

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్న ప్రభుత్వ ప్రకటనపై ప్రతాపరామకృష్ణ సోమవారం స్పందించారు. వేములవాడలో ఆయన ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడారు. దసరా తర్వాత మూసివేస్తామని చెప్పిన నేపథ్యంలో ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆలయ మూసివేతతో 500 ప్రత్యక్ష, 3000 పరోక్ష కుటుంబాలు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.