News March 9, 2025
4 రోజుల్లో కూతురి వివాహం.. తండ్రి మృతి

నాలుగు రోజుల్లో కూతురు వివాహం ఉండగా తండ్రి మృతి చెందిన ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. మొండికుంటకి చెందిన రైతు చిన్న వెంకన్న గుండెపోటుతో మృతి చెందాడు. కాగా కూతురి వివాహనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుభలేఖలు పంచి ఇంటికి వచ్చిన ఆయన ఆకస్మాత్తుగా మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగారు. కాగా ఈ నెల 12న జరగాల్సిన వివాహం వాయిదా పడింది.
Similar News
News November 18, 2025
రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

వాట్సాప్‌లో ‘మీ-సేవ’.. Hi అని పంపితే చాలు!

TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారా మీ-సేవా సర్వీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశముంది. 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు. ఇన్‌కం, బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు.