News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News October 22, 2025
ఇరాక్‌లో గుండె పోటుతో పెగడపల్లి వాసి మృతి

పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) ఇరాక్‌లో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వెళ్లిన రమేశ్, బుధవారం ఇంటికి వచ్చేందుకు గాను మంగళవారమే విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం రమేశ్ గుండె పోటుకు గురయ్యాడు. స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా మృతి చెందాడు.
News October 22, 2025
గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.
News October 22, 2025
కృష్ణపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. పోర్టుకు సమీపంలో తుఫాను ఉదృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పెన్నా నదికి వరద ఉదృతి పెరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.