News March 9, 2025

కాకినాడ: తల్లితో స్కూటర్‌పై 92వేల కి.మీ. ప్రయాణం

image

బెంగుళూరుకు చెందిన కృష్ణకుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతని తండ్రి దక్షిణామూర్తి మృతి చెందడంతో తల్లి ఒంటరితనం చూసి ఉద్యోగం వదిలి మైసూర్ వచ్చేశారు. తీర్థయాత్రలు చేయాలన్న తల్లి కోరికను కొడుకు తీరుస్తున్నాడు. తన తండ్రి కొన్న స్కూటర్‌పై పర్యటనలు ప్రారంభించారు. ఇప్పటివరకు 92 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. శనివారం కాకినాడలోని ఆలయాలు సందర్శించారు. తల్లి కోసం చేస్తున్న పనిని చూసి అతడిని పలువురు అభినందించారు.

Similar News

News March 22, 2026

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర రూ.390!

image

మచిలీపట్నం మాంసం మార్కెట్‌లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా ఉన్నప్పటికీ, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పట్టణంలో చికెన్ స్కిన్‌లెస్ రూ. 390 పలుకుతోంది. మటన్ కిలో రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చేపల మార్కెట్‌లో బొచ్చె రూ. 200, సీలావతి రూ. 170కి విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

కాకతీయుల దూరదృష్టి.. భావితరాలకు ప్రయోజనం..!

image

ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల దూరదృష్టి భావితరాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. గణపతి దేవుడు, రేచర్ల రుద్రుడు, రుద్రదేవుడు, ప్రోలరాజు క్రీ.శ 1200 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జలాశయాలు, గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ప్రధానంగా రామప్ప, లక్నవరం, పాకాల, గణప సముద్రం తదితర సరస్సులు నేటికీ చెక్కుచెదరలేదు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి.
#నేడు ప్రపంచ జల దినోత్సవం.

News March 22, 2026

HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

image

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్‌ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT