News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News March 31, 2026
పీరియడ్స్ వాయిదాకు పిల్స్ వాడుతున్నారా?

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల్లో ఇబ్బంది పడకుండా మహిళలు పీరియడ్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేసే మాత్రలను వాడటం పెరిగింది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిని తరచూ వేసుకొంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. నెలసరి క్రమం తప్పుతుంది. తలనొప్పి, వికారం, రొమ్ములో గడ్డలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కొందరికి హార్ట్ అటాక్ ముప్పూ ఉంటుంది’ అని చెబుతున్నారు.
#ShareIt
News March 31, 2026
PDPL: కేజీబీవీల్లో NEET, JEE, CLAT కోచింగ్ ప్రారంభం

PDPL జిల్లాలోని KGBVల్లో చదువుతున్న విద్యార్థినులను జాతీయస్థాయి పోటీపరీక్షలకు సిద్ధం చేసే లక్ష్యంతో ప్రత్యేక కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు GCDO కవిత తెలిపారు. జూలపల్లిలో NEET, రామగుండంలో JEE, సుల్తానాబాద్‌లో CLAT కోచింగ్ నిర్వహిస్తున్నారు. నిపుణుల బోధన, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులతో శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.
News March 31, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. రైతు భరోసా, బీమా, రుణమాఫీ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.


