News March 9, 2025

ఎన్టీఆర్: బీ. ఫార్మసీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల 

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో బీ. ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3,5వ సెమిస్టర్ (రెగ్యులర్) థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 11లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ సెమిస్టర్ ఈనెల 26 నుంచి, 5వ సెమిస్టర్ ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి. 

Similar News

News February 24, 2026

గద్వాల: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

image

జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్-12 కింద ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని కలెక్టర్ వివరించారు.

News February 24, 2026

సిద్దిపేట: గర్భిణుల సంరక్షణపై ANMలకు ప్రత్యేక శిక్షణ

image

సిద్దిపేటలో గర్భధారణ నిర్వహణ నియమాలపై ANMలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. DMHO డాక్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో ARMMAN సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో జరిగింది. గర్భిణీ నమోదు నుంచి ప్రసవం వరకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాల నివారణకు ANMలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 24, 2026

కేటీదొడ్డి: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య!

image

పనికి వెళ్లలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన మహేశ్ (19) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది. తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.