News March 23, 2024

బాలికపై సీఐ అత్యాచారం

image

TG: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భూపాలపల్లి వీఆర్ సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ 2022లో కాకతీయ యూనివర్సిటీ PSలో ఎస్సైగా పనిచేశాడు. అప్పటినుంచి హనుమకొండకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే ఆమె కూతురుపై కన్నేసిన అతడు.. అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో సీఐపై పోక్సో కేసు నమోదైంది.

Similar News

News February 16, 2026

Xలో సాంకేతిక లోపం

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాము యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయామంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. పోస్టులు, కామెంట్లు కనపడటం లేదని, వీడియోలు స్ట్రీమ్ అవ్వట్లేదని తెలిపారు. సా.6-7.30 మధ్య అంతరాయాలు ఏర్పడినట్లు అమెరికాలో దాదాపు 42వేల మంది, ఇండియాలో 2వేల మంది ఫిర్యాదులు చేశారు. మీకు X ఓపెన్ అవుతోందా? కామెంట్ చేయండి.

News February 16, 2026

ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయం!

image

T20WC: భారత్ చేతిలో ఘోర ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి. టీమ్ ప్రదర్శనపై మేనేజ్‌మెంట్ ఆగ్రహంతో ఉన్నట్లు PCB అధికారి ఒకరు వెల్లడించారు. ఓటమి తర్వాత అర్ధరాత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సీనియర్ ఆటగాళ్లైన బాబర్, షాహీన్ అఫ్రీదిపై వేటు వేయనున్నట్లు పేర్కొన్నారు. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్‌కు పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

News February 16, 2026

కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు

image

TG: మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను SEC అధికారికంగా ప్రకటించింది. INC 82 ఛైర్మన్, 5 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 18 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFBలకు చెరొకటి, ఇండిపెండెంట్లకు 3 ఛైర్మన్ స్థానాలు దక్కాయి. కార్పొరేషన్లలో కొత్తగూడెం CPI, కరీంనగర్ BJP ఖాతాలో చేరాయి. 11 చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది.