News March 9, 2025
VKB: రేషన్ కార్డ్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో పరిశీలన

జిల్లాలో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాట్లు చేస్తోంది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. కాగా కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభల ద్వారా దరఖాస్తులు ఇంతకు ముందే స్వీకరించింది.
Similar News
News January 11, 2026
NSUTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT)లో 31 టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 3వరకు పంపాలి. BE/BTech/BS/ME/MTech/MS, M.Arch, MBA/PGDM/CA/ICWA/M.Com, PhD ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు. సైట్: https://nsut.ac.in
News January 11, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: SP

సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SP నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. కోడిపందేలు, జూదం జరిగే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందన్నారు. వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కోడి పందేల నిర్వహణకు తోటలు, స్థలాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పవన్నారు.
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


