News March 9, 2025

SLBC వద్ద భయం.. భయం.!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

Similar News

News February 3, 2026

పాలమూరు కార్పొరేషన్‌లో ఖాతా తెరిచిన కాంగ్రెస్

image

మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. పాలమూరు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ జెండా ఎగిరింది.

News February 2, 2026

MBNR: ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: SP

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆమె ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.

News February 2, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలు.. SP సమీక్ష

image

మహబూబ్‌నగర్ జిల్లా నందు జరగనున్న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపల్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.