News March 9, 2025
NZB: పాఠ్యాంశంగా రమేశ్ కార్తీక్ నాయక్ కవి పద్యం

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఆంగ్లంలో రాసిన’లైఫ్ ఆన్ పేపర్ ‘అనే కవితను బళ్ళారి (కర్ణాటక) శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లిష్ – మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా పొందుపరిచింది. ఇది ఒక గాఢమైన భావోద్వేగ కవిత అని దీనిని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 10, 2026
మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్‌పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్‌ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.
News January 10, 2026
సంగారెడ్డి: ఉత్తమ పోస్ట్‌మ్యాన్‌గా సతీష్, పోస్ట్‌వుమెన్‌గా అశ్వినీ

హైదరాబాద్ రీజియన్ తపాలా శాఖ పరిధిలో ఉత్తమ డెలివరీ స్టాఫ్‌గా సంగారెడ్డి డివిజన్‌కు చెందిన కే. సతీష్ కుమార్, ఇ. అశ్వినీ ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో వీరిని ప్రత్యేక మెమెంటోలతో సన్మానించనున్నారు. వీరి ఎంపికపై తోటి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
News January 10, 2026
కన్నవాళ్లే కాటికి పంపుతున్నారు

కొందరు తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని కాలరాస్తున్నారు. AP కృష్ణా(D)లో 45రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసింది. TG నారాయణపేట(D)లో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా రంగారెడ్డిలో ఓ తల్లి 11నెలల కొడుకును విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అత్త సూటిపోటి మాటలు, భార్యతో గొడవలు, భర్త వేధింపులు కారణమేదైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపడం కలవరపెడుతోంది.


