News March 9, 2025

క్రీడలపై దృష్టి సారించాలి: అర్జున అవార్డు గ్రహిత శోభ

image

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని అర్జున అవార్డు గ్రహీత, ఓలంపిక్ క్రీడాకారిని జేజే.శోభ అన్నారు. మేడ్చల్‌ పట్టణంలోని ఓ హై స్కూల్‌లో ఛైర్‌‌పర్సన్‌ మంజూల ప్రకాశ్‌ ఆధ్వర్యంలో క్రీడలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. క్రీడాకారులు ఎదగాలంటే కృషి పట్టుదల తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం అన్నారు.

Similar News

News November 4, 2025

MHBD: బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి: కలెక్టర్

image

అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు జిల్లాలోని డోర్నకల్ పరిధిలో 267, MHBD పరిధిలో ఉన్న 288, పోలింగ్ కేంద్రాలలో కేంద్రానికి ఇద్దరు చొప్పున అన్ని రాజకీయ పార్టీల బూతు లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు.

News November 4, 2025

‘నీ కోసం నా భార్యను చంపేశా’.. మహిళలకు ఫోన్‌పేలో మెసేజ్

image

బెంగళూరులో కృతికా రెడ్డి అనే డాక్టర్ హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చి ఆమెను హత్య చేసిన కేసులో భర్త మహేంద్రా రెడ్డి గత నెలలో అరెస్టయ్యాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశా’ అని ఐదుగురు మహిళలకు ఫోన్‌పేలో అతడు మెసేజ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్‌లో హత్య తర్వాత కొన్నాళ్లకు ఇలా చేశాడని, పాత బంధాలను తిరిగి కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని చెప్పారు.

News November 4, 2025

బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

image

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.