News March 9, 2025
INDvNZ: భారత్ బౌలింగ్.. జట్లు ఇవే

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులో ఆడిన టీంతోనే బరిలోకి దిగనుంది. NZ పేసర్ హెన్రీ గాయంతో దూరమయ్యారు.
భారత జట్టు: రోహిత్(C), గిల్, కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్‌దీప్, వరుణ్.
న్యూజిలాండ్: యంగ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్ (C), జేమీసన్, విలియమ్, నాథన్ స్మిత్.
Similar News
News March 10, 2025
ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.
News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in
News March 10, 2025
PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.