News March 9, 2025

ప.గో: రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

image

మార్చి 10 నుంచి ప్రతి సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా గత నెల రోజులుగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా ప్రారంభిస్తామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 5, 2026

ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

image

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

News March 5, 2026

9న భీమవరం వస్తున్న షర్మిల!

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

News March 5, 2026

ప.గో: బైక్ ఢీకొని యువకుడి మృతి

image

నరసాపురం మండలం సీతారామపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణ కోల్పోయారు. శేరేపాలెం గ్రామానికి చెందిన చిలకపాటి జేమ్స్ (32) హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాళీపట్నంకు చెందిన సంజీవరావు తన బైక్‌తో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జేమ్స్ నరసాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.