News March 9, 2025

పానగల్: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

image

పానగల్ మండలం తెల్లరాళ్లపల్లికి చెందిన సంగనమోని రాముడు నిన్న మధ్యాహ్నం కోడేరు మండలం మైలారం ఆంజనేయునికుంట చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారని మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి తెలిపారు. వల పట్టుకొని ఈదుతూ ఒడ్డుకు చేరుతున్నప్పుడు వల చుట్టుకొని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారని అన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం అనంతరం శవాన్ని అప్పగించారని అన్నారు.

Similar News

News March 16, 2026

సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.

తూ.గో: మహిళపై సామూహిక అత్యాచారం.. నలుగురికి యావజ్జీవ శిక్ష

image

కడియపులంకలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులకు రాజమండ్రి జిల్లా కోర్టు సోమవారం యావజ్జీవ జైలు శిక్ష విధించింది. 2024 అక్టోబర్ 14న పని నుంచి వస్తున్న ఆమెను అడ్డగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కడియం పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.