News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News January 11, 2026

మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

image

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.

News January 11, 2026

KNR: కంటైనర్‌ బోల్తా.. రైతు స్పాట్‌డెడ్

image

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో స్థానిక రైతు రాణవేని హనుమంతు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News January 11, 2026

కడప: టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

YSR కడప జిల్లాలోని GGH, CCCలో 34 పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసైనవారు JAN 5 నుంచి 12వరకు అప్లై చేసుకోవచ్చు. అటెండెంట్, MNO, FNO, స్ట్రెచర్ బాయ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, BC, EWS అభ్యర్థులకు రూ.250. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/