News March 23, 2024
బాలీవుడ్‌లో ఉప్పెన రీమేక్

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమా యువతను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలిసిందే. కాగా ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. తన రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్‌గా సినిమాను పునర్నిర్మించాలని చూస్తున్నారు. కాగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ యెర్నేని నిర్మించారు.
Similar News
News January 12, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో 7 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్(మైనింగ్), బీఈ, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ, పీహెచ్‌డీ(జియాలజీ), ఎంఏ( హిందీ, ఇంగ్లిష్), MBBS, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ careershindcopper@gmail.comకు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్ పంపాలి. వెబ్‌సైట్: hindustancopper.com/
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ పేరిట 12 ఏళ్లుగా నిధులు స్వాహా 2/2

TG: ఖాళీలు భర్తీకాని తరుణంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని GOVT నియమించుకుంటుంది. ఇందుకు ఏజెన్సీలకు 20% కమీషన్ 12 ఏళ్లుగా అందిస్తోంది. ఇవన్నీ గతంలో BRS నేతల బినామీల పేరిట ఏర్పాటైనవిగా తెలుస్తోంది. ఆధార్ లింక్ లేకపోవడంతో బోగస్ పేర్లతో నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. GOVT, ఉద్యోగి వాటా EPF, ESI నిధులనూ మింగేశాయి. ఇలా భారీగా దోచుకున్న సంస్థలపై ప్రభుత్వం నివేదికను రెడీ చేసింది.


