News March 9, 2025
షమీకి గాయం

భారత స్టార్ బౌలర్ షమీకి గాయమైంది. 7వ ఓవర్ వేస్తుండగా రచిన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోగా అది షమీ ఎడమ చేతికి తగిలి రక్తం వచ్చింది. చికిత్స అనంతరం షమీ ఓవర్ పూర్తి చేశారు. ఓవర్ ముగిసిన తర్వాత మైదానాన్ని వీడారు. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండటంతో షమీ కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Similar News
News December 28, 2025
బంగ్లాదేశ్‌లో దాడులను అందరూ వ్యతిరేకించాలి: అమెరికా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ఖండించింది. ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే యువకుడిని ఓ ముఠా హత్య చేసిన ఘటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణమైన ఘటనలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం యూనస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు.
News December 28, 2025
DRDO-DGREలో JRF పోస్టులు

<
News December 28, 2025
న్యూ ఇయర్ పార్టీ చేసుకునే వారికి హెచ్చరిక

TG: న్యూ ఇయర్ పార్టీల్లో మద్యం వినియోగానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ హెచ్చరించారు. జనవరి 1 వరకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(NDPL)తో పాటు డ్రగ్స్ అమ్మకాలు, వినియోగాలపై తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. NDP లిక్కర్‌ను రాష్ట్రంలోకి రాకుండా అన్ని మార్గాల్లో నిఘా పెట్టి నిలువరించాలని అధికారులను ఆదేశించారు.


