News March 9, 2025
ఒకే రోజు 105 శంకుస్థాపనలు.. మంత్రి లోకేశ్ అభినందనలు

AP: నెల్లూరు రూరల్ TDP MLA కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని మంత్రి లోకేశ్ అన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదో అరుదైన ఘట్టమన్నారు. CM చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనడానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచిన కోటంరెడ్డిని అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Similar News
News April 17, 2026
2 రాష్ట్రాల ఎన్నికలు.. రూ.865 కోట్లు సీజ్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్, తమిళనాడులో ఇప్పటి వరకు రూ.865 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ECI వెల్లడించింది. ఇందులో రూ.99 కోట్ల నగదు, రూ.84 కోట్ల విలువైన 32.91 లక్షల లీటర్ల లిక్కర్ ఉన్నాయని తెలిపింది. అలాగే రూ.174 కోట్ల డ్రగ్స్, రూ.159 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.350 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు పేర్కొంది.
News April 17, 2026
ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్ర కరెక్ట్ కాదు: RGV

ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్రను తప్పుగా చూపించారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘దావూద్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడని, ఏ పనీ చేయట్లేదని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. అతడు క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయినట్లు నమ్ముతున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా భారత్‌లో అలజడి సృష్టించేందుకు దావూద్ అక్కడి ISIతో కలిసి కుట్రలు పన్నినట్లు ఈ మూవీలో చూపించారు.
News April 17, 2026
అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.


