News March 9, 2025

ఇస్రోకు త్వరలో రెండు కొత్త లాంచ్ ప్యాడ్‌లు

image

ISRO త్వరలో రెండు కొత్త లాంచ్‌ప్యాడ్‌లను ప్రారంభించనుందని ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. ఏపీలోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్టిణంలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోపు ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. చంద్రయాన్-4ను 2028లో ప్రయోగిస్తామని, చంద్రునిపై నమూనాలను సేకరించడమే దాని లక్ష్యమని పేర్కొన్నారు. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలకు పురుషులతో సమానంగా అవకాశాలు ఉంటాయన్నారు.

Similar News

News March 10, 2025

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

News March 10, 2025

ప్రాజెక్టుల్లో పడిపోతున్న నీటి నిల్వలు

image

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్నాయి. బోర్డు ఆదేశాలను లెక్కచేయకుండా ఏపీ జలదోపిడీ చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌లో 29.27 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 8.35 టీఎంసీలు, సింగూరు ప్రాజెక్టులో 22.34 టీఎంసీలే ఉన్నాయి.

News March 10, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in

error: Content is protected !!