News March 9, 2025

కల్వకుర్తిలో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు

image

కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్‌ఐ మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలెపు కొండల్ హాజరయ్యారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి, డాక్టర్ స్వాములు, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

ఇవాళ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. అర్హతలివే

image

గుంటూరులోని ANUలో ఇవాళ AP, ఈ నెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు కలర్ ఫొటోలు తీసుకువెళ్లాలి. 6AM-10AM లోపు ANUకు చేరుకోవాలి.

News March 12, 2026

అనకాపల్లి: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. 6, 11వ తరగతుల ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అనాథలు, బడి బయట ఉన్నవారు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వలస కార్మికులు, తల్లిదండ్రులు ఒక్కరే ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు.

News March 12, 2026

కామారెడ్డి: భగవద్గీత ముద్రణతో పెళ్లి ఆహ్వాన పత్రిక

image

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ ఆహ్వాన పత్రికల రూపకల్పనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా “భగవద్గీత” రూపంలో పెళ్లి పత్రికలను ముద్రించడం ఒక సరికొత్త ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుని వివాహానికి ధర్మ ప్రచారం జరగాలని, భగవద్గీత జ్ఞాన ప్రధాన విశిష్టత తెలిసేలా ఆహ్వాన పత్రికను రూపొందించారు. మీకు అలాంటి పత్రికలు వచ్చాయా!