News March 9, 2025

రేపు బాధ్యతలు స్వీకరించనున్న నూతన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం ఉదయం 10గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయ వర్గాలు ఆదివారం తెలిపాయి. పాత ఎస్పీ రూపేష్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బాధ్యతల స్వీకరణ తర్వాత జిల్లాలోని శాంతిభద్రతలపై సమీక్షిస్తారని తెలిపారు.

Similar News

News March 25, 2026

జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

image

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

News March 25, 2026

విజయవాడలో ‘ఉగ్ర’ అనుమానితులుగా అరెస్టయింది వీరే

image

వించిపేటలో సోమవారం పోలీసులు ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. అరెస్టైన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్‌ల ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. వీరిలో రహమతుల్లా ర్యాపిడో డ్రైవర్‌గా, సోహైల్ బిర్యానీ షాపులో, డానిష్ ఆటోనగర్‌లో పని చేస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు.

News March 25, 2026

శ్రీకాకుళం: డయేరియా ఘటనలో సస్పెండ్.. మళ్లీ ఆయనే కమిషనర్

image

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.