News March 9, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతల వివరాలు..

☞ 1998 – సౌతాఫ్రికా
☞ 2000 – న్యూజిలాండ్
☞ 2002 – శ్రీలంక& ఇండియా(వర్షం వల్ల ఫైనల్ రద్దైంది)
☞ 2004 – వెస్టిండీస్
☞ 2006 – ఆస్ట్రేలియా
☞ 2009 – ఆస్ట్రేలియా
☞ 2013 – ఇండియా
☞ 2017 – పాకిస్థాన్
☞ 2025* – లోడింగ్
Similar News
News March 10, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం పేర్లు ఖరారయ్యాయి. BRS దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. ఏపీలో టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన తరఫున నాగబాబు టికెట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిని నేడు ప్రకటించనున్నారు.
News March 10, 2025
నామినేషన్లకు నేడే ఆఖరు..

TG: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ రావు, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా 20న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఈసీ లెక్కింపు నిర్వహించనుంది.
News March 10, 2025
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.