News March 9, 2025

రేపు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: ఎస్పీ 

image

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

Similar News

News March 10, 2025

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

image

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్, వక్ఫ్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం లోక్‌సభ ఆమోదం కోరే అవకాశముంది. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రెండో విడత ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

News March 10, 2025

లోక్ అదాలత్ ద్వారా 1,211 కేసులు పరిష్కరించాం: ఎస్పీ

image

దేశవ్యాప్తంగా నిర్వహించబడిన జాతీయ లోక్ అదాలతో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులను పరిష్కరించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. ఐపీసీ కేసులు 601, ఎక్సైజ్ కేసులు 473, స్థానిక చట్టాలు సంబంధించిన కేసులు 133 మొత్తం కలిపి 1,211 కేసులను పరిష్కరించామని తెలిపారు. డీసీఆర్బీ సీఐ నరసింహారావు, కోర్టు సిబ్బందిని అభినందించారు.

News March 10, 2025

వరంగల్‌‌లో విధులు సంతృప్తినిచ్చాయి: అంబర్ కిషోర్ ఝా

image

వరంగల్‌ కమిషనరేట్‌లో సీపీగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీపై వెళ్తున్న పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న అంబర్‌ కిషోర్‌ ఝాతోపాటు, సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్‌జోన్‌ డీసీపీ రవీందర్‌ను కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులు ఆదివారం ఘనంగా సత్కరించారు.

error: Content is protected !!