News March 9, 2025

సత్యసాయి జిల్లాలో యువతి సూసైడ్

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. మహిళకు ఇటీవల వివాహం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2025

నల్గొండ: టీమ్ ఇండియా క్రీడాకారులకు మంత్రి కోమటిరెడ్డి విషెస్ 

image

అద్భుతమైన ఆట తీరుతో, అప్రతిహత విజయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ టోర్నీలో, టీమిండియా విజయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

News March 10, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. అభిమానుల హర్షం

image

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పేరు ఖరారు కావడంతో మెదక్ ప్రాంతంలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆమె బీజేపీలోనూ పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు.

News March 10, 2025

జుక్కల్‌కు రూ.200 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి.

error: Content is protected !!