News March 9, 2025

రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గంగూలీ ఏమన్నారంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వస్తున్న వార్తలపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘ఈ చర్చ అవసరం ఏముంది? కొద్ది నెలల క్రితమే అతడు దేశానికి వరల్డ్ కప్ అందించారు. బాగా ఆడుతున్నాడు. సెలక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. 2027 వన్డే WCలోనూ రోహిత్ ఆడితే బాగుంటుంది. గత మ్యాచ్ ప్రదర్శనే రిపీట్ చేస్తే ఇవాళ కప్ మనదే’ అని వెల్లడించారు.

Similar News

News March 10, 2025

రోజూ తలస్నానం చేస్తున్నారా?

image

వెంట్రుకలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తలస్నానం తప్పనిసరి. తలలో జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి నాలుగు సార్లు హెడ్ బాత్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మం ఉన్నవారు వారానికి 2 సార్లు చేయాలని చెబుతున్నారు. దుమ్ము, ధూళి, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే రోజూ హెడ్ బాత్ చేయాలని సూచిస్తున్నారు. ఇక వేసవిలో శిరోజాల సమస్యలు రాకుండా ఉండేందుకు వారానికి 4సార్లు చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

News March 10, 2025

శ్రేయస్‌ సైలెంట్ హీరో.. రోహిత్ శర్మ ప్రశంసలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్‌(243)పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అతనో సైలెంట్ హీరో అని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, మిడిలార్డర్‌లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని చెప్పారు. ఈ విజయాన్ని భారత అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నారు. కాగా ఫైనల్లో అయ్యర్ 62 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశారు.

News March 10, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం పేర్లు ఖరారయ్యాయి. BRS దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. ఏపీలో టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన తరఫున నాగబాబు టికెట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిని నేడు ప్రకటించనున్నారు.

error: Content is protected !!