News March 9, 2025
కొడంగల్: 10వ తరగతి విద్యార్థిని సూసైడ్

తండ్రి మందలించాడని మనస్తాపంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొడంగల్ మండలం మహంతిపూర్‌కు చెందిన లాలప్ప.. భార్య అనిత, కూతురు(15), కొడుకుతో కలిసి పొలం పనులకు వెళ్లారు. పొలం వద్ద కూతురు(15)ని లాలప్ప మందలించగా అలిగి ఇంటికెళ్లిన బాలిక ఉరేసుకుంది. గమనించిన సోదరుడు తండ్రికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
Similar News
News November 11, 2025
SRPT: ఎస్సారెస్పీ స్టేజ్-2 కాలువ పేరు మార్పు

SRSP స్టేజ్-II కాకతీయ ప్రధాన కాలువకు RDR SRSP స్టేజ్-II కాలువగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నో సేవలందించారు. ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని ఎస్సారెస్పీకి ప్రభుత్వం ఆయన పేరు పెట్టింది. ఎస్సారెస్పీ స్టేజి-2కి ఆయన పేరు పెట్టడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News November 11, 2025
వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

TG: నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.
News November 11, 2025
JGTL: నిరుద్యోగ మహిళలకు NOV 14న జాబ్ మేళా

JGTL జిల్లాలోని నిరుద్యోగ మహిళల జాబ్ మేళాను 14వ తేదీ ఉదయం 10గంటల నుంచి పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు సర్టిఫికెట్ల జిరాక్స్, 2 ఫొటోలు తీసుకునివెళ్లాలి. భోజన వసతి ఉంటుంది. ఈ జాబ్ మేళా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో టి.సదాశివ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. SHARE IT.


