News March 9, 2025
నంద్యాల కలెక్టరేట్‌లో రేపు ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News December 29, 2025
HYDలో భారీ అగ్ని ప్రమాదం.. ‘@2వేలు’

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్ల: నేటి నుంచి యథావిధిగా ప్రజావాణి

గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సామాన్యులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం తమను సంప్రదించాలని పేర్కొన్నారు.