News March 9, 2025
సిద్దిపేట కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 10న సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి తమ తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో వైట్ సూట్స్ ఎందుకంటే?

సాధారణంగా ఐసీసీ ట్రోఫీల్లో విజేతలు తమ జట్టు జెర్సీలతోనే కప్ అందుకుంటారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ వైట్ బ్లేజర్స్ ధరిస్తారు. ఈ సూట్ ప్లేయర్ల గొప్పతనం, దృఢ సంకల్పాన్ని తెలిపే ‘గౌరవ బ్యాడ్జ్’ అని ఐసీసీ తెలిపింది. ట్రోఫీ కోసం చేసిన కృషి, స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ(నాకౌట్ టోర్నీ) 1998లో ప్రారంభమైనా ఈ వైట్ సూట్ సంప్రదాయం 2009 నుంచి మొదలైంది.
News March 10, 2025
కృష్ణా: ఈనెల 19న మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రారంభం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ ఈనెల 19న ప్రారంభం కానుంది. ప్రభుత్వం పనులను వేగవంతం చేయడంతో అశోక్ లేలాండ్ బస్సు బిల్డింగ్ యూనిట్ సిద్ధమైంది. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ యూనిట్‌ను మార్చి 19న మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. మొత్తం ఈ పారిశ్రామిక వాడ 1,467 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
News March 10, 2025
INDIA WIN.. బండి సంజయ్ రియాక్షన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమ్ఇండియా..అన్ స్టాపబుల్, అన్ బీటబుల్, అన్ ఫర్గెటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ది మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.