News March 9, 2025
సూర్యాపేట: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 10, 2025
చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు

మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆదివారం రాత్రి పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ సందడి.. ఫొటో గ్యాలరీ

కివీస్‌పై గెలిచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గర్వంగా ముద్దాడిన వేళ జట్టు సభ్యులు ఆనందంగా కనిపించారు. తోటి ప్లేయర్లతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అలాగే గత రికార్డులతో పోలుస్తూ ఫ్యాన్స్ కొన్ని ఫొటోలను క్రియేట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. పైన ఉన్న గ్యాలరీలో భారత ఆటగాళ్ల CT గెలుపు సంబరాలు చూడొచ్చు.
News March 10, 2025
జనగామ: నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి

జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.