News March 9, 2025
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

AP: ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థుల పేర్లను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ (ఎస్సీ-మాల), బీద రవిచంద్ర (యాదవ), బీటీ నాయుడు (బోయ)కు ఎమ్మెల్సీ టికెట్లు కేటాయించింది. 5 స్థానాలకు గాను ఇప్పటికే ఒకటి జనసేనకు ఇవ్వగా, మరొకటి బీజేపీకి కేటాయించనుంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురే కావలి గ్రీష్మ. ఆశావహులు చాలా మందే ఉన్నా ఊహించని నేతలకు టికెట్లు దక్కాయి.
Similar News
News March 10, 2025
నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.
News March 10, 2025
40 డిగ్రీలు దాటనున్న పగటి ఉష్ణోగ్రతలు

TG: మరో వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిన్న అత్యధికంగా నల్గొండ (D) చిట్యాలలో 39.8 డిగ్రీలు నమోదైంది. KNR, HNK, BHPL, KMR, ASF, NZB, మేడ్చల్, నారాయణ్ పేట్, నిర్మల్, PDPL, SDPT, వనపర్తి, MHBD జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7డిగ్రీలుగా రికార్డ్ అయింది.
News March 10, 2025
IPL-2025 నుంచి వైదొలిగిన హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ తాను IPL-2025లో ఆడటం లేదని ప్రకటించారు. దేశానికి ఆడటమే తన ప్రాధాన్యత అని, రాబోయే సిరీస్‌ల కోసం ప్రిపేర్ అయ్యేందుకే IPLకు దూరం అవుతున్నట్లు పేర్కొన్నారు. 2024 వేలంలో అతడిని DC రూ.6.25కోట్లకు కొనుగోలు చేసింది. ఆక్షన్‌లో ఎంపికై టోర్నీలో పాల్గొనకపోతే రెండేళ్ల నిషేధం విధిస్తామని IPL ఇటీవల కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. దీంతో అతడిపై రెండు సీజన్ల పాటు బ్యాన్ ఉండనుంది.