News March 9, 2025

సూర్యాపేట: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

image

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.  

Similar News

News March 10, 2025

అమరవాయిలో వ్యక్తి మృతి

image

ఈనెల 3న ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాలు.. మల్దకల్ మండలం అమరవాయికి చెందిన నాగరాజు(35) కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యాపారంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.

News March 10, 2025

ఏలూరు: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్?

image

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వంశీ(25) విజయవాడలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఓ యువతి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి గిరిపురంలో రూము తీసుకుని ఉంటున్నారు. ఇటీవల ఆ యువతి రూము నుంచి వెళ్లిపోయింది. బాధతో వంశీ ఈనెల 6వ తేదీ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు.

News March 10, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!