News March 9, 2025
NZB: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో మెరిగే కవిత(43) అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. ఆమె కుమారుడు పూల వ్యాపారం చేసి నష్టపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కుమారుడు నష్టపోయిన విషయంలో కవిత మనస్తాపానికి గురైందన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News March 23, 2026
నిజామాబాద్: మూడు నెలల రేషన్ ఒకేసారి!

ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతి నెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
News March 22, 2026
నిజామాబాద్: భగ్గుమంటున్న మాంసం ధరలు

నిజామాబాద్ జిల్లాలో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో రూ.320, స్కిన్‌లెస్ రూ.358కి చేరింది. మటన్ ధరలు సైతం పైపైకి వెళ్తున్నాయి. సాధారణ మేక మాంసం రూ.500-600 పలుకుతుండగా, పొట్టేలు మాంసం రూ.800 నుంచ రూ.900 వరకు విక్రయిస్తున్నారు. వేసవి ఎండల ప్రభావం, శుభకార్యాల వల్ల పెరిగిన డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.
News March 22, 2026
NZB: నేడు ప్రపంచ జల దినోత్సవం.. మీరేం చేయాలంటే?

“నీరు లేనిదే జీవం లేదు.. నీటిని పొదుపుగా వాడటం మనందరి బాధ్యత” అనే నినాదంతో నేడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహించనున్నారు. కురుస్తున్న వర్షాలు, ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గతంలో కంటే కొంత మెరుగయ్యాయి. అయినప్పటికీ “ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడడంతో పాటు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం, బావులను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.


