News March 9, 2025

సూర్యాపేట: స్వల్ప మెజారిటీతో అద్దంకి ఓటమి..!

image

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.

Similar News

News March 5, 2026

HYD: గ్రేట్ సర్.. మరణించినా ప్రాణాలు కాపాడారు!

image

తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్‌పూర్‌ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మార్చి 3న బ్రెయిన్ డెడ్ కావడంతో ఆర్గాన్స్‌ను డొనేట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నారు. కుటుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకం అని సజ్జనార్ ట్వీట్ చేశారు.

టెక్కలి: ఈ నెలలో వివాహం.. అంతలోనే విషాదం

image

టెక్కలి (M) తలగాం గ్రామ సమీపంలో బుధవారం రైలు ఢీకొని ప్రవల్లిక అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందిన విషయం విదితమే. మృతురాలిది నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామం. తండ్రి గోపాలరావు తాపీ మేస్త్రి, తల్లి శిరీష గృహిణి. టెక్కలిలో ఇంజినీరింగ్ 2వ ఏడాది చదువుతున్న పెద్ద కుమార్తె ప్రవల్లికకు ఈనెల 21వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే విషాదం నెలకొంది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.