News March 9, 2025
వర్గల్: విషాదం.. తల్లి మందలించిందని విద్యార్థి సూసైడ్

తల్లి చదువుకోమని మందలించినందుకు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి వివరాలిలా.. వర్గల్ మండలం చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న విజయేందర్ రెడ్డి(16) గురువారం వారి పొలం వద్దకు వెళ్లాడు. దీంతో చదువుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు అని తల్లి మందలించింది. దీంతో పురుగు మందు తాగిన విజయేందర్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
Similar News
News March 10, 2025
మోడల్ స్కూల్స్ ప్రవేశాలు.. 20 వరకు అవకాశం

సిద్దిపేట జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. 6 నుంచి10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని గజ్వేల్ మండలం ముత్రాజ్పల్లి మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ డా. జె.వన్నెస్స తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 10, 2025
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కోనసీమ కుర్రాడు మృతి

పి.గన్నవరం మండలం జొన్నల్లంక చెందిన సందాడి సాయి వెంకటకృష్ణ (20) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. బైక్‌పై వస్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మణికంఠ లక్ష్మీసాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల ఈ యువకులు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News March 10, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో జమ్మికుంట 38.3°C, గంగాధర 37.6, ఖాసీంపేట 37.2, కొత్తపల్లి-ధర్మారం 37.0, తాంగుల, ఇందుర్తి 36.4, ఈదులగట్టేపల్లి 36.3, వీణవంక 36.2, నుస్తులాపూర్ 36.0, రేణికుంట 35.4, బురుగుపల్లి, పోచంపల్లి 35.0, చిగురుమామిడి 34.9, గుండి 34.8, అర్నకొండ 34.5, గంగిపల్లి, మల్యాల 34.4, గట్టుదుద్దెనపల్లె 34.3, బోర్నపల్లి 34.1, తాడికల్ 34.0°C గా నమోదైంది.