News March 9, 2025
NZB: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ(62) ఒక షోరూంలో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేసి ఇంటికి బైక్‌పై వెళుతుండగా త్రిమూర్తి ఎదురుగా మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.
Similar News
News March 13, 2026
NZB: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News March 13, 2026
UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.
News March 13, 2026
NZB: 15 నుంచి ఇంటర్ మూల్యాంకనం

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ మూల్యాంకనం సబ్జెక్ట్‌ల అధ్యాపకులు 15న రిపోర్ట్ చేయాలని DIEO టీ.రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు వారి కళాశాల లాగిన్‌లలో అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్‌లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు. విధుల్లోని అధ్యాపకులను రిలీవ్ చేయాలని, రిలీవ్ చేయని ప్రిన్సిపల్, యాజమాన్యాలపై చర్యలు తప్పవన్నారు.


