News March 9, 2025
నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

☞ అబద్ధపు హామీలతోనే టీడీపీ గద్దెనెక్కింది: కాటసాని ☞ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ ☞ గాజుల పల్లెలో రైల్వే బోగీల తొలగింపు.. రైళ్ల రాకపోకల పున:ప్రారంభం ☞ ఆళ్లగడ్డలో మొబైల్ షాప్ ఓపెనింగ్.. ఓనర్, కస్టమర్ మధ్య వివాదం ☞ అర్ధరాత్రి కర్నూలుకు పోసాని ☞ బనగానపల్లెలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ ☞ బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య ☞ అధికారంతో దాడులు చేసింది వైసీపీనే: కాట్రెడ్డి
Similar News
News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News March 10, 2025
దుబ్బాక: కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

రోడ్డు ప్రమాదంలో <<15703438>>యువకుడు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కూతురు పుట్టిందన్న సంతోషంలో వెళ్తున్న యువకుడి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల వివరాలిలా.. పోతారం వాసి నరేశ్(28)కు నెల క్రితం కూతురు పుట్టింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్‌లోని అత్తగారింట్లో ఉన్న భార్య, పాపను తీసుకురావడానికి ఆదివారం బైక్‌పై వెళ్తున్నాడు. ఆకారం శివారులో ఆటో ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనపై కేసు నమోదైంది.
News March 10, 2025
సామర్లకోట: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

సామర్లకోట మండలం గొంచాల గ్రామం వద్ద బైకు అదుపు తప్పడంతో యువకుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు చంద్రంపాలెం గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు స్థానికులు వివరించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.