News March 9, 2025

BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. BRS తరఫున రేపు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. అటు కాంగ్రెస్ విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది.

Similar News

News March 10, 2025

కూల్ డ్రింక్ మూత, పల్లి గింజకు చిన్నారులు బలి!

image

TG: చిన్నపిల్లలకు ఏది తినాలి, ఏది తినకూడదో తెలియదు. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. తాజాగా బాటిల్ మూత మింగి ఓ చిన్నారి, గొంతులో పల్లీ ఇరుక్కొని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల(D) ఊట్కూర్‌‌లో రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి చనిపోగా, MHBD జిల్లా నాయకపల్లిలో అక్షయ్(18 నెలలు) గొంతులో పల్లీ ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందాడు.

News March 10, 2025

భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు

image

విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి JSP రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. ఈ రెండింటికీ ఒకే విధమైన పోలికలు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం’ అని ట్వీట్ చేశారు.

News March 10, 2025

కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

image

మధ్యప్రదేశ్‌లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!