News March 9, 2025
వికారాబాద్ TODAY TOP NEWS

✓బొంరాస్ పేట:తండ్రి మందలించాడని కూతురు ఆత్మహత్య.✓ పరిగి:ఘనంగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.✓కొట్ పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పెరిగిన సందర్శకులు తాకిడి.✓వికారాబాద్:తొట్ల ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న స్పీకర్.✓వికారాబాద్ జిల్లాలో రెండు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం.✓ మోమిన్ పేట సిఐగా జి.వెంకట్ బాధ్యతలు.✓బొంరాస్ పేట:రోడ్డు తవ్వకాల్లో బయటపడిన పురాతన విగ్రహం.
Similar News
News January 2, 2026
పెద్దపల్లి: TGTA, TGRSA క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ

తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్(TGTA), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) క్యాలెండర్, డైరీలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, అరుణశ్రీ చేతుల మీదుగా నేడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ (TGTA), డా.రాముడు (TGRSA), ప్రధాన కార్యదర్శులు ప్రకాష్, అనిల్ కుమార్, తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.
News January 2, 2026
సిరిసిల్ల: ఆత్మరక్షణ విద్య శిక్షకుల దరఖాస్తుల ఆహ్వానం

ఆత్మ రక్షణ విద్య శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థినులకు ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంగ్ఫూ, జూడో తదితర ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన శిక్షకులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈనెల ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 2, 2026
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


