News March 9, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల తేదీలు ఖరారు 
>దేవీపట్నంలో పర్యాటక బోట్లను తనిఖీ చేసిన పోలీసులు 
>ఏవోబీలో మహేష్ బాబు షూట్..! 
>ఈనెల 18వ తేదీలోపు పీ4 సర్వే పూర్తి చేయాలి
>కాఫీ కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలి 
>గంజాయిని వ్యతిరేకించాలి..అరకులో సినీ నటులు
>జైపూర్ జంక్షన్..ఎటు వెళ్లాలో తెలియక తికమక
> సముద్రం చేపలకు పెరిగిన గిరాకీ

Similar News

News January 14, 2026

విజయ్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

image

ఓ వర్గం ఫ్యాన్స్ కావాలనే తమ సినిమాపై విమర్శలు చేస్తున్నారని పరాశక్తి టీమ్ ఆరోపిస్తోంది. ఫేక్ IDల ద్వారా కొంత మంది బురద జల్లుతున్నారని తాజాగా డైరెక్టర్ సుధా కొంగర అన్నారు. తమపై విమర్శలు చేస్తున్నది రాజకీయ వర్గాలు కాదన్నారు. పండుగకు విడుదలకు నోచుకోని మరో సినిమా హీరో ఫ్యాన్సే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఆమె విజయ్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది.

News January 14, 2026

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

News January 14, 2026

అన్నమయ్య: భార్య మరణవార్త విని భర్త మృతి

image

‘ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి’ 60 ఏళ్ల కిందట వివాహ సమయంలో ఆ దంపతులు చేసిన ప్రమాణం ముందు మృత్యువు తలవంచింది. బి.కొత్తకోట (M) అమరనారాయణ పురానికి చెందిన అంజమ్మ(85),శ్రీరాములు(90)దంపతులు. వృద్ధాప్యం వరకూ అన్యోన్యంగా ఉన్నారు. మంగళవారం ఉదయం అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మృరణవార్త విన్న శ్రీరాములు కూడా కుప్పకూలి మృతి చెందాడు.