News March 9, 2025
భారత జట్టుకు అభినందనల వెల్లువ

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Similar News
News March 10, 2025
ఏసీ ధరలు పెరిగే అవకాశం

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి. ఎండ తీవ్రత పెరిగి, 25-30% వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4-5% పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగే ఆస్కారం ఉంది.
News March 10, 2025
Stock Markets: దూకుడు కంటిన్యూ..

స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,654 (102), సెన్సెక్స్ 74,653 (313) వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. CPSE, PSE, కమోడిటీస్, మెటల్స్, మీడియా, ఎనర్జీ, రియాల్టి, FMCG, ఇన్ఫ్రా, ఫైనాన్స్, చమురు షేర్లు ఎగిశాయి. ఆటో, వినియోగ, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. పవర్ గ్రిడ్ టాప్ గెయినర్.
News March 10, 2025
పూరీ డైరెక్షన్‌లో నాగార్జున సినిమా?

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరీ చెప్పిన స్టోరీ నాగ్‌కు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి (2003), సూపర్ (2005) తెరకెక్కాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్‌తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.