News March 10, 2025

NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

image

వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.

Similar News

News March 10, 2025

ట్రంప్ టారిఫ్స్‌తో భారత్‌కు మేలు: RBI మాజీ డిప్యూటీ గవర్నర్

image

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్‌కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.

News March 10, 2025

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ ప్రకటించింది. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోము వీర్రాజు గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ తరఫున గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

News March 10, 2025

భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్

image

అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (20) మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరీబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ టూర్‌కు వెళ్లి ప్యూంటా కానా బీచ్ వద్ద అదృశ్యమయ్యారు. దీంతో ఆమె కోసం పోలీసులు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. వర్జీనియాలో ఉంటున్న సుదీక్ష పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతోందని ఆమె తండ్రి సుబ్బరాయుడు తెలిపారు.

error: Content is protected !!